
- టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
వికారాబాద్, వెలుగు: పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అభివృద్ధిని పట్టించుకోలేదని, కేసీఆర్ సొంత ప్రయోజనాలకే ప్రయార్టీ ఇచ్చారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. మంగళవారం బషీరాబాద్ మండలంలోని ఎక్మాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శామప్ప, మరో 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మహేశ్‌కుమార్ గౌడ్, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత, నర్సింలుగౌడ్, శంకరప్ప, సాయిరెడ్డి, నర్సింలు, మంజునాథ్, దుస్యాంత్ రెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.