బీసీ రిజర్వేషన్లు ముగిసిన అధ్యయం కాదు.. ఎవరు తొందరపడొద్దు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

బీసీ రిజర్వేషన్లు ముగిసిన అధ్యయం కాదు.. ఎవరు తొందరపడొద్దు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ముగిసిన అధ్యయం కాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు విషయంలో ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని.. చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం బలిదానం చేసిన ఈశ్వర చారి మృతి బాధాకరమని అన్నారు. ఈశ్వర చారి కుటుంబాన్ని అందుకుంటామని చెప్పారు. ఎవరు తొందరపడొద్దని.. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని భరోసా ఇచ్చారు. 

శనివారం (డిసెంబర్ 6) మహేష్ కుమార్ గౌడ్ యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఒక వైపు సంక్షేమం.. మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి సగర్వంగా చెప్పుకునే విధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మెట్ జరగబోతోందని చెప్పారు. 

►ALSO READ | టెన్త్‌‌‌‌‌‌‌‌లో 100 శాతం ఫలితాలు సాధించాలి : కలెక్టర్ పమేలాసత్పతి

రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు తెలంగాణ అభివృద్ధి కోసం పడ్డ కష్టానికి రిజల్ట్ గ్లోబెల్ సమ్మిట్ రూపంలో కనిపిస్తుందని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను మిగిలిని మూడేండ్లలో ప్రజలచేత శభాష్ అనిపించుకుంటామని తెలిపారు.