ఇంటి దొంగల పనే.. సీబీఐ ఎంక్వైరీ వేయాలె

ఇంటి దొంగల పనే.. సీబీఐ ఎంక్వైరీ వేయాలె

కోకాపేట భూముల వేలంపై కేంద్ర హోం శాఖ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కోకాపేట భూములపై ఇప్పటికే సీబీఐకి ఫిర్యాదు చేశామన్నారు. భూముల వేలం సమాచారం హెచ్ఎండీఏ ఆఫీసులో మాయం కావడంతో ఇంటి దొంగల పాత్ర నిజమని తేలిందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ప్రభుత్వం ఆదాయం కోసం హైదరాబాద్‌ శివారులోని కోకాపేట భూములను కేసీఆర్ సర్కారు కొన్నాళ్ల క్రితం వేలంలో అమ్మింది. అయితే ఈ వేలంలో ఇతరులను పాల్గొననీయకుండా చేసి, ఆ భూములను తక్కువ రేటుకే సీఎం కేసీఆర్ బినామీలకే కట్టబెట్టారని రేవంత్ ఆరోపించారు. ఇందులో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అన్నారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని గతంలో ఆయన కేంద్ర హోం మంత్రిని కలిసి కోరారు. అయితే ఆ భూముల వేలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ హెచ్ఎండీఏ ఆఫీసులో కనిపించకుండా పోయాయని వార్తలు రావడంతో.. ఇది ఇంటి దొంగల పనేనని తేలిపోయిందంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

వేడిని చర్మం ఎలా గుర్తిస్తదో తేల్చిన సైంటిస్టులకు నోబెల్

బెయిల్‌కు నో.. షారుఖ్ కొడుకు ఎన్సీబీ కస్టడీ పొడిగింపు

దిశ కమిషన్ విచారణకు హాజరైన సజ్జనార్