మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయింది :  రేవంత్ రెడ్డి

మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయింది :  రేవంత్ రెడ్డి

ప్రధాని మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయిందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  అన్నారు.  మోడీని ఓడించవచ్చునని కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని చెప్పారు. ప్రజల భద్రతను కేంద్రం గాలికి వదిలేసిందని,  ప్రజలను పట్టించుకోకుండా కేంద్రమంత్రులు కర్ణాటకలో మోహరించారని రేవంత్ అన్నారు.  

కర్ణాటకలో కులాలు , మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలని బీజేపీ ప్లాన్  చేసిందని, అయితే   బీజేపీ కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు.  కర్ణాటక ప్రజలు ఇచ్చిందని  సరైన తీర్పుని వెల్లడించారు.  

దేశస్థాయిలో బీజేపీ స్థాయిని కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్లను కేసీఆర్ కర్ణాటకలో ఖర్చు చేసారని అన్నారు.  మోడీ, కేసీఆర్ వేర్వేరు కాదని ఇద్దరు ఒక్కటేనని రేవంత్  చెప్పారు.

కేసీఆర్ కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  ప్రజలకు రేవంత్ సూచించారు.  కాంగ్రెస్ త్యాగాలు చేసి తెలంగాణ ఇచ్చిందని లేకపోతే కేసీఆర్, కేటీఆర్ బతుకులు ఏం అయ్యావో ఆలోచించుకోవాలన్నారు.