జైపాల్ రెడ్డికి రేవంత్ ఘన నివాళి

V6 Velugu Posted on Jan 16, 2022

జైపాల్ రెడ్డి కృషితోనే తెలంగాణ సిద్దించిందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని స్ఫూర్తి స్థల్ లో ఆయన సమాధి దగ్గర రేవంత్ నివాళులర్పించారు. ఆయన రాజకీయ విలువలను పాటించిన గొప్ప నేత అని కొనియాడారు. ఉత్తమమైన రాజకీయ నాయకుడిగా, కాంగ్రెస్ వాదిగా దేశానికే వన్నె తెచ్చారన్నారు. హైదరాబాద్ కు మెట్రో రావడంలో జైపాల్ రెడ్డి కృషే కారణమన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాకారం అయిందంటే జైపాల్ రెడ్డి చొరవతోనే సాధ్యమైనదన్నారు. జైపాల్ రెడ్డి ఆలోచనలు, సూచనలతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసిందన్నారు. సోనియా గాంధీ ఉక్కు సంకల్పం, జైపాల్ రెడ్డి ఆలోచనలతో ఏర్పాటైందన్నారు.

తెలంగాణ లో వారి ఆశయాలు నెరవేరలేదన్నారు. జైపాల్ రెడ్డి స్పూర్తితో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. భవిష్యత్  తరాలకు ప్రజాస్వామ్య విలువలు లేకుండా కుట్ర చేస్తున్నారని, వాటిలో మార్పు రావాలని చాల సందర్భాల్లో జైపాల్ చెప్తుండేవారన్నారు. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లే అన్నట్లు కెసిఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో రాజకీయ విలువలను బతికిచ్చెనందుకు దీక్ష తీసుకుంటున్నామన్నారు. రాజకీయ చతురత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదట గుర్తుకువచ్చేది పీవీ, మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డియే అన్నారు రేవంత్. 

ఇవి కూడా చదవండి: 

స్పీకర్ పోచారానికి రెండోసారి కోవిడ్ పాజిటివ్

మెహందీ ఫంక్షన్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డ్యాన్స్

Tagged Congress, Jaipal reddy, tpcc chief revanth reddy, Jaipal birth anniversary

Latest Videos

Subscribe Now

More News