స్పీకర్ పోచారానికి రెండోసారి కోవిడ్ పాజిటివ్

స్పీకర్ పోచారానికి రెండోసారి కోవిడ్ పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గారికి రెండవసారి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నిన్న స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో  టెస్ట్ చేయించుకున్నారు. దీంతో టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఎటువంటి  సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు AIG, గచ్చిబౌలి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు స్పీకర్ పోచారం. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని పోచారం తెలిపారు. తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఆయన కోరారు. గతేడాది నవంబర్ లో కూడా స్పీకర్ పోచారం కరోనా బారిన పడ్డారు. 

మరోవైపు తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. నిత్యం రెండువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సంక్రాంతి ఎఫెక్ట్ తో  శనివారం మాత్రం రెండువేలకు చేరువులో కేసులు రికార్డ్ అయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 53,073 కొవిడ్ టెస్టులు చేయగా..1963 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1075, మేడ్చల్ లో 150, రంగారెడ్డి జిల్లాలో 168 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,07,162కు చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మరణించారు.

ఇవి కూడా చదవండి: 

రాష్ట్రంలో కొత్తగా 1963 కరోనా కేసులు, ఇద్దరు మృతి

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా