తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించిన రేవంత్

తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించిన రేవంత్

దేశంతోపాటు తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో నిర్వహించిన తెలంగాణ విలీన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్ ను టీజీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎగరే విధంగా జెండా రూపొందిస్తామన్నారు.  

కేసీఆర్ పెట్టిన కుంపటిని బీజేపీ అందిపుచ్చుకుని మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని రేవంత్ ఆరోపించారు. దేశాన్ని కలిపి ఉంచేది కాంగ్రెస్ అని..విచ్చిన్నం, విభజన చేసేది బీజేపీ అని మండిపడ్డారు. దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ కీలక పాత్ర పోషించిందన్నారు. ఎందరో మహనీయులు తమ విరోచిత పోరాటంతో భూస్వాములను, పెత్తందారును దిగంతాలకు తరిమారని చెప్పారు. 1950లో గాంధీభవన్ కు పునాధి వేసిందే సర్ధార్ వల్లాభాయ్ పటేల్ అని..అటువంటి నేతకు నివాళులు అర్పించడానికి బీజేపీ ఏం నైతిక హక్కు ఉందని విమర్శించారు.