ప్రాజెక్టుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది

ప్రాజెక్టుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్లే ప్రాజెక్టులు డేంజర్ జోన్లలోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రేవంత్ ట్వీట్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి లక్ష కోట్లు వెచ్చించామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం వాటి నిర్వహణకు 1000కోట్లు కూడా ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. కమీషన్లు లేకపోతే కల్వకుంట్ల వారు కదలరా అంటూ విమర్శించారు. పైసలుంటేనే ప్రగతిభవన్ తలుపులు తెరుచుకుంటాయా అంటూ ట్వీట్ చేశారు.