
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ స్వాగతిస్తుందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షు డు నిరంజన్ అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రియాంక, రాహుల్ గాంధీలు కలిస్తే దేశంలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. రాహుల్ పాదయాత్రలు, పర్యటనలు ప్రధాని మోదీ వెన్నులో వణుకు పుట్టించాయని తెలిపారు. ప్రియాంక గాంధీని చూస్తే వారి నాయనమ్మ ఇందిరమ్మను చూసినట్టు దేశ ప్రజలు ఫీల్ అవుతున్నారని చెప్పారు. ప్రియాంక గాంధీ లోక్ సభలో అడుగు పెట్టాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని వివరించారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని నిరంజన్ పేర్కొన్నారు.