
- టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ రాజీవ్
హైదరాబాద్, వెలుగు: చదువుకున్న ప్రతి వ్యక్తి రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని, సరైన నాయకులను ఎన్నుకునే స్పృహ కలిగి ఉండాలని టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ అన్నారు. వైద్య రంగానికి సంబంధించి ప్రతి నిర్ణయం, కేటాయింపు రాజకీయాలపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ రాజీవ్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పీసీసీ మెడికల్ డిపార్ట్ మెంట్ స్టేట్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ చైర్మన్ మహేశ్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య ప్రయాణం తనకు పేరు, గౌరవం ఇచ్చిందని, కానీ మనసు మాత్రం ఎప్పుడూ ప్రజల కష్టాలపైనే నిలిచిందని, అందుకే తాను రాజకీయ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు. రేండేండ్ల కాలంలోనే హెల్త్ డిపార్ట్ మెంట్ లో ప్రభుత్వం అనేక పోస్టులను భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఐఎంఏ బ్రాంచ్ అధ్యక్షుడు డా. బి. వెంకటేశ్వర్ రావు, కార్యవర్గ సభ్యులు, 500 మంది వైద్యులు పాల్గొన్నారు.