
బస్ పాస్ ఛార్జీల పెంపు విద్యార్థుల పాలిట పిడుగుపాటులా తయారైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇష్టమొచ్చినట్లుగా ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలు పెంచడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు రేవంత్ ట్వీట్ చేశారు. ఆర్టీసీ తీసుకున్న బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయం పేద మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉందన్నారు. ఆర్టీసీ తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం వారి పాలిట పిడుగుపాటు.
— Revanth Reddy (@revanth_anumula) June 11, 2022
ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉంది. మోయలేని భారంతో విద్యార్థులను చదువులకు దూరం చేసేలా ఉంది. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. pic.twitter.com/cub8hhEpwZ
ఇకపోతే... స్టూడెంట్లకు ఇచ్చే రాయితీని కట్ చేయడంతో బస్ పాస్ ఛార్జీలు మూడు రెట్లు పెరిగాయి. స్టూడెంట్ గ్రేటర్ బస్ పాస్ ఇదివరకు నెలకు రూ.195 ఉండగా... ఇప్పుడు రూ.450కి పెరిగింది. ఇక జనరల్ మంత్లీ పాస్ ఛార్జీ రూ.165 నుంచి అమాంతం రూ.400కు ఎగబాకింది. కాలేజీలు, పాఠశాలలు తెరవనున్న నేపథ్యంలో విద్యార్థులపై తీవ్ర భారం పడనుంది