అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి : రేవంత్ రెడ్డి

అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి : రేవంత్ రెడ్డి

అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురితే  స్పందించడం లేదన్నారు.  నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో  ఆయన పాల్గొన్నారు. పెద్దమనిషి స్థానంలో ఉన్న పోచారం.. ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చిండని ఆరోపించారు.  ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదని ఈ సందర్భంగా  రేవంత్  ప్రశ్నించారు. ధర్మపురి అర్వింద్ పేరులోనే ధర్మం ఉంది కానీ  ఆయన పనిలో అధర్మం కనిపిస్తుందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ చేసిన అభివృద్ది తప్ప మరేం లేదన్నారు.  

వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని రేవంత్  రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దని,  రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు  రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని  చెప్పారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, యవతకు ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలను భర్తీ చేస్తామన్నారు. గ్యాస్  సిలిండర్ రూ.500 లకే అందిస్తామని రేవంత్  తెలిపారు.