ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలి : హనుమాండ్ల ఝాన్సీరెడ్డి

ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలి : హనుమాండ్ల ఝాన్సీరెడ్డి

తొర్రూరు, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని టీపీసీసీ వైస్​ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కోరారు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు క్లిన్​స్వీప్​ చేసి కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా మంగళవారం పట్టణంలోని 11, 15 వార్డుల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు పోనుగొటి సోమేశ్వర్​ రావు, బొమ్మనబోయిన సుజాత వెంకన్న తరఫున ఇంటింటి ప్రచారం చేశారు.

కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి బర్త్​డే సందర్భంగా పార్టీ ఆఫీస్​లో నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.