మంత్రి కేటీఆర్ ‌కు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ

మంత్రి కేటీఆర్ ‌కు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ

టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మంత్రి కేటీఆర్ ‌కు బహిరంగ లేఖ రాశారు. మంగ‌ళ‌వారం కేటీఆర్ కరీంనగర్ లో పర్యటించ‌నున్న‌ నేపథ్యంలో.. లేఖ‌లో కొన్ని అంశాలు ప్ర‌స్తావిస్తూ వాటిని ప‌రిష్క‌రించాల్సిందిగా కోరారు. కరీంనగర్ లో ఐటీ ట‌వ‌ర్ ప్రారంభించనున్న క్ర‌మంలో జిల్లా వారికి ఎంతమందికి ఉపాధి దొరుకుతుంద‌ని, ఐటీ పార్క్ ప్రారంభోత్సవ జాప్యానికి కారణం కూడా చెప్పవలసిందిగా కోరారు.టీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభంపై ఉన్న శ్రద్ధ.. డబుల్ బెడ్‌రూమ్‌ల మీద ఎందుకు లేదని నిలదీశారు. శాతవాహన యూనివర్సిటీకి వైస్ ఛాన్స్ లర్ ని ఎప్పుడు నియమిస్తారో తెలియజేయాల‌న్నారు. కరీంనగర్‌కు రావాల్సిన సైనిక్ స్కూల్, లెదర్ పార్క్, హార్టీ కల్చర్ యూనివర్సిటీలను ఇతర జిల్లాలకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. కరీంనగర్ నగరంలోని గల్లీల రోడ్ల దుస్థితి గమనించి , ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ప్రభాకర్ కోరారు.