ఉద్యోగాలు చేయడం కాదు..సృష్టించే స్థాయికి ఎదగాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఉద్యోగాలు చేయడం కాదు..సృష్టించే స్థాయికి ఎదగాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     ఏ పనైనా శ్రద్ధతో చేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     లక్ష్య సాధన కోసం కష్టపడాలని యువతకు పిలుపు
  •     ఐఎస్‌‌‌‌బీలో జాతీయ యువజన దినోత్సవానికి చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా హాజరు

గచ్చిబౌలి, వెలుగు: యువత లక్ష్య సాధన కోసం కష్ట పడాలని, ఫెయిల్యూర్స్‌‌‌‌ను తట్టుకొని నిలబడగలగాల ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. సమస్య ఎక్కడ ఉందో గుర్తించి, స్వామి వివేకానంద చెప్పినట్లు ఏ పని చేసినా శ్రద్ధపెట్టాలని సూచించారు. హైదరాబాద్‌‌‌‌ గచ్చిబౌలిలోని ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్‌‌‌‌ (ఐఎస్‌‌‌‌బీ)లో సీఐఐ యంగ్ ఇండియన్స్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా  ‘2047 నాటికి భారత్ అభివృద్ధి, నాయకత్వం వైపు యువత కార్యాచరణ’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో ముఖ్య అతిథిగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. 

‘‘మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని కోసం హార్డ్​వర్క్​చేయాలి. అదే మనల్ని ఉన్నతస్థాయిలో నిలబెడుతుంది”అని చెప్పారు. మనం ఏదైనా వస్తువు తయారు చేయా లనుకుంటే అది సాధారణ వ్యక్తికి కూడా ఉపయోగపడేదై ఉండాలన్నారు. ఉద్యోగాలు చేయడం కాదని.. కొలువులను సృష్టించే స్థాయికి ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం ఐఎస్​బీ అసోసియేట్ ​డైరెక్టర్​ శ్రీధర్​ భాగవతుల మాట్లాడారు.