పాక్‌‌ పోలీసుల వాహనంపై టెర్రరిస్టుల దాడి...ఆరుగురు పోలీసులు మృతి

పాక్‌‌ పోలీసుల వాహనంపై టెర్రరిస్టుల దాడి...ఆరుగురు పోలీసులు మృతి

పెషావర్‌‌‌‌: పాకిస్తాన్‌‌లో జరిగిన బాంబు దాడిలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సోమవారం ఖైబర్‌‌‌‌ ఫఖ్తుంక్వా ప్రావిన్స్‌‌లో టాంక్‌‌ జిల్లాలో పోలీసులు పెట్రోలింగ్‌‌ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో టెర్రరిస్టులు పోలీసు వెహికల్‌‌ లక్ష్యంగా ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో స్టేషన్‌‌ హౌస్ ఆఫీసర్‌‌‌‌, సబ్ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌, ముగ్గురు ఎలైట్‌‌ ఫోర్స్‌‌ మెన్స్‌‌, ఒక డ్రైవర్‌‌‌‌ మృతి చెందారు. బాంబు దాడి ఘటన తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని హాస్పిటల్‌‌కు తరలించారు. ప్రావిన్స్‌‌ సీఎం సోహైల్ ఆఫ్రిది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.