యాడ్స్ బిజినెస్లోకి సినీపోలిస్

యాడ్స్ బిజినెస్లోకి సినీపోలిస్

హైదరాబాద్​, వెలుగు: సినిమా ప్రకటనల రంగంలోకి సినీపోలిస్ ఇండియా అడుగుపెట్టింది. ఇందుకోసం డిజిటల్ మీడియా సంస్థ ఇట్స్ స్పాట్‌‌‌‌లైట్‌‌‌‌తో ఒప్పందం చేసుకుంది. 

దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో గల 63 నగరాల్లోని 101 సినిమా హాళ్లలో 350 పైగా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది. యువతను, పట్టణ వాసులను చేరుకోవడానికి సినిమా హాళ్లు సరైన వేదికని సినీపోలిస్ ఎండీ దేవాంగ్ సంపత్ తెలిపారు. ప్రకటనకర్తలు రియల్ టైమ్ డేటా ఆధారంగా తమ ప్రచారాన్ని పర్యవేక్షించుకోవచ్చని,  దీనివల్ల బ్రాండ్‌‌‌‌లకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అన్నారు.