హైదరాబాద్: ఇంటర్నేషనల్ సెయిలింగ్ రెగెట్టాలో హైదరాబాద్ సెయిలర్లు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం గెలుపొందారు. అండర్–18 విభాగంలో మణిదీప్ పేర్కట్ల గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.
బాలికల విభాగంలో సికింద్రాబాద్ సెయిలర్ శృంగారి, స్కిఫ్ క్లాస్ విభాగంలో యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన గోవర్ధన్ పల్లారా సిల్వర్‌ను సాధించారు. అండర్–15 బాలుర కేటగిరీలో 14 ఏళ్ల రవి కుమార్ బొన్నెలు కాంస్యం నెగ్గాడు. ఒక ఇంటర్నేషనల్ పోటీల్లో హైదరాబాద్‌కు నాలుగు పతకాలు రావడం ఇదే తొలిసారి. పతకాలు గెలిచిన నలుగురు సెయిలర్లు ఏప్రిల్‌లో చైనాలోని సాన్యాలో జరిగే ఆసియా బీచ్ గేమ్స్‌లో ఇండియా తరఫున బరిలోకి దిగనున్నారు.
