తలసాని క్షమాపణ చెప్పాలి: పీసీసీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ డాక్టర్ కోట నీలిమ

తలసాని క్షమాపణ చెప్పాలి: పీసీసీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ డాక్టర్ కోట నీలిమ

పద్మారావునగర్‌‌, వెలుగు: సీఎం రేవంత్‌‌ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ చేసిన వ్యాఖ్యలను పీసీసీ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌, సనత్‌‌నగర్‌‌ కాంగ్రెస్‌‌ ఇన్​చార్జి డాక్టర్​ కోట నీలిమ ఖండించారు. తలసాని 24 గంటల్లో సీఎం రేవంత్‌‌ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. 

తలసాని వ్యాఖ్యలకు నిరసనగా సనత్‌‌నగర్‌‌ నియోజకవర్గంలోని బేగంపేట్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ వద్ద కాంగ్రెస్‌‌ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. 

తలసాని 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే సనత్‌‌నగర్‌‌ గల్లీగల్లీలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌‌ డివిజన్ల పునర్విభజన ప్రజల అభీష్టం మేరకే జరిగిందని, అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్‌‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.