- ఆదర్శంగా నిలిచిన కమిషనర్ దంపతులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సతీమణి శ్వేతా దేశాయ్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మాత శిశు కేంద్రంలో సోమవారం పండంటి పాపకు జన్మనిచ్చారు. నిండు గర్భిణి అయిన శ్వేతా దేశాయ్‌ను కమిషనర్.. ఆదివారం కరీంనగర్ హాస్పిటల్‌లో జాయిన్ చేయగా.. నిపుణులైన గైనకాలజిస్టుల పర్యవేక్షణలో ఆమెకు సిజేరియన్ చేశారు.
ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కమిషనర్ దంపతులకు కలెక్టర్ పమేలా సత్పతి, హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన, వైద్య అధికారులు అభినందనలు తెలిపారు.
