ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, మందులు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ తేజస్ నంద్‌ లాల్ పవార్

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, మందులు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ తేజస్ నంద్‌ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డాక్టర్లు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఎస్పీ కే. నరసింహతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని జాతీయ రహదారి 65  మీదుగా ఎక్కువ వాహనాలు వెళుతున్నాయని ఏమైనా అనుకొని ప్రమాదం జరిగితే తక్షణమే వైద్య సేవలు అందించేలా డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. 

ఫార్మసీ స్టోర్  పరిశీలించి అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.  మెడిసిన్స్ అయిపోకముందే తెప్పించుకోవాలని సూచించారు.  కలెక్టర్ వెంట సివిల్ సర్జన్ ఆర్ఎంఓలు గీత వాణి, వినయ్, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి 

సూర్యాపేట, వెలుగు: భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికతను ప్రపంచ నలుమూలల చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కొనియడారు. సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో యువజన సర్వీసులు క్రీడా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ పాల్గొని  వివేకానంద ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  

ఆసక్తి ఉన్న రంగాల్లో వినూత్నంగా ఆలోచించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ..  చిన్న వయసులోనే దేశ ఔన్నత్యాన్ని విదేశాలకు తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, మాజీ మన్సిపల్ చైర్మన్లు జుట్టుకొండ సత్యనారాయణ, అన్నపూర్ణ, వివేకానంద ఉత్సవ కమిటీ చైర్మన్ నాగార్జున, కార్యదర్శి ప్రభాకర్, సభ్యులు, పుర ప్రముఖులు, యువత, తదితరులు పాల్గొన్నారు.