స్మార్ట్ ఫోన్ కాదు.. మనస్సు స్మార్ట్గా ఉండాలి : కేంద్ర మంత్రి బండి సంజయ్

స్మార్ట్ ఫోన్ కాదు.. మనస్సు స్మార్ట్గా ఉండాలి : కేంద్ర మంత్రి బండి సంజయ్
  •     స్వామి వివేకానందుడి స్ఫూర్తితో దేశం కోసం పనిచేయండి
  •      కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు

కరీంనగర్, వెలుగు: యువత స్మార్ట్ ఫోన్లకే పరిమితం కావొద్దని, స్మార్ట్ మనస్సును తయారు చేసుకోవాలని, వైఫై కాదని,  విల్ పవర్ పెంచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రశ్నించే ధైర్యాన్ని నింపుకోవాలని, అన్యాయం జరిగితే ఎదిరించే శక్తి పెంచుకోవాలని,  దేశం కోసం పనిచేయాలన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కళాభారతిలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పలువురికి ‘స్పోర్ట్స్ కిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అందజేశారు. 

అంతకుముందు బండి సంజయ్ మాట్లాడుతూ దేశ ఖ్యాతిని ఖండంతారాలు దాటించడమే కాకుండా భారతీయ సమాజాన్ని జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. విదేశాలన్నీ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవుతుంటే... మనం మాత్రం మోడరన్ కల్చర్ పేరుతో విదేశీ కల్చర్ ను అలవాటు చేసుకుంటున్నామని తెలిపారు.  కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా యువజన అధికారి రాంబాబు, జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాస్ గౌడ్ తదితరులు  పాల్గొన్నారు.