- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: సినీ పరిశ్రమపై సీఎం, కొందరు ప్రభుత్వ పెద్దలు జులుం చేస్తూ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రతిదాంట్లోనూ కమీషన్లు దండుకోవడం అలవాటుగా మారిందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సినిమా ప్రదర్శనలు కలెక్టర్ పరిధిలో ఉంటాయని, అలాంటప్పుడు ఒక్కొక్క శాఖ నుంచి ఒక్కోసారి టికెట్ రేట్ల పెంపు జీవోలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. నచ్చినవారికి నజరానా, నచ్చనివారికి జరిమానా అన్న విధంగా ప్రభుత్వ విధానాలున్నాయని విమర్శించారు.
