ఐసీయూలో విద్యారంగం..బడి కోసం బస్సు యాత్ర అనుభవాలతో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి టీపీఎఫ్ లేఖ 

ఐసీయూలో విద్యారంగం..బడి కోసం బస్సు యాత్ర అనుభవాలతో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి టీపీఎఫ్ లేఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగం ఐసీయూలో ఉందని, తక్షణ చికిత్స అందించాలని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్(టీపీఎఫ్) ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల 10 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించిన 'బడి కోసం- బస్సు యాత్ర' పరిశీలనలు, క్షేత్రస్థాయి ఫీడ్‌‌‌‌బ్యాక్ ఆధారంగా పలు డిమాండ్లతో కూడిన లేఖను సీఎం రేవంత్​రెడ్డికి పంపింది. ఈ లేఖపై టీపీఎఫ్ కోర్ కమిటీ సభ్యులు ఆకూనూరి మురళి, ఎంవీ రెడ్డి, ఎం.చంపాలాల్, ప్రొఫెసర్ పద్మజాషా తదితరులు సంతకాలు చేశారు.

బస్సు యాత్రలో భాగంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను సందర్శించి.. టీచర్లు, పేరెంట్స్, గ్రామ పెద్దలు, విద్యావేత్తలతో రౌండ్‌‌‌‌ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు స్వతంత్ర ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ను ఏర్పాటు చేసి, పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. కొత్తగా కొన్ని బడులను నిర్మించడం మాత్రమే కాకుండా, ఇప్పటికే ఉన్న వేలాది ప్రభుత్వ స్కూళ్లను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్నారు. సీఎం ఆవిష్కరించిన అరుట్ల పబ్లిక్ స్కూల్ మోడల్​ను అన్ని మండలాల్లోని బడులకు వర్తింపజేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో కనీసం 18 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించేలా చట్టం చేయాలన్నారు.