ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు లివ్వండి : టీపీటీయూ

ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు లివ్వండి : టీపీటీయూ
  •     సీఎస్ రామకృష్ణారావుకు టీపీటీయూ వినతి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే హెల్త్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ కోరారు. శుక్రవారం సెక్రటేరియెట్​లో సీఎస్ రామకృష్ణారావును ఆ సంఘం ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ తో కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంప్లాయీస్, పింఛనర్లకు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వివాదాస్పద జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయి ఇబ్బందులు పడుతున్న టీచర్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లోని డీఏలను రిలీజ్ చేస్తూనే, పీఆర్సీని వెంటనే అమలు పరచాలని సీఎస్‌కు యూనియన్ నేతలు రిక్వెస్ట్ చేశారు.