భారీగా మద్యం పట్టివేత

భారీగా మద్యం పట్టివేత

బషీర్ బాగ్/జీడిమెట్ల/వికారాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలోని వేర్వేరు చోట్ల పోలీసులు శనివారం భారీగా మద్యం పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీర్ బాగ్ పరిధి పూల్ బాగ్ ప్రాంతానికి చెందిన నౌకత్ కిరణ్ కుమార్ పండ్ల వ్యాపారి. ఈజీ మనీ కోసం ఇంట్లోనే బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు. హోళీ పండుగ సందర్భంగా వైన్​షాపులు క్లోజ్​ఉండడంతో, బ్లాక్​లో అమ్మేందుకు పెద్ద మొత్తంలో స్టాక్​పెట్టుకున్నాడు. శుక్రవారం రాత్రి లక్డీకాపూల్ లోని వైన్స్ లో లిక్కర్ ​కొనుగోలు చేసి తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

 లిక్కర్​ను సీజ్​చేశారు. అలాగే జగద్గిరిగుట్ట లెనిన్​నగర్ కు చెందిన సొంటిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉమాదేవినగర్​కు చెందిన కె.రజనీకాంత్​అక్రమంగా బెల్ట్​షాపులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలానగర్​ఎస్ఓటీ పోలీసులు శనివారం షాపులపై రైడ్​చేసి 375 లిక్కర్​సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న వాస్కోడిగామ రైలులో శుక్రవారం అర్ధరాత్రి వికారాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రెండు బ్యాగుల్లో 25 మద్యం బాటిళ్లు దొరికాయి.