శామీర్ పేట, వెలుగు: శామీర్ పేట పరిధిలోని హైదరాబాద్– -కరీంనగర్ రాజీవ్ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలియాబాద్ ఎక్స్‌రోడ్డు సమీపంలో ఖాళీ లోడ్‌తో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను లారీ వెనుక నుంచి ఓవర్‌స్పీడ్‌తో ఢీకొట్టింది.
ఈ ఘటనలో ట్రాక్టర్ రెండు ముక్కలుగా విరిగిపోగా, ట్రాక్టర్డ్రైవర్మృతి చెందాడు. మృతుడిని అలియాబాద్‌కు చెందిన ఆకాష్ ఉత్తమ్ సోన్ కాంబ్లే (31)గా పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్‌పై ఉన్న మరొక వ్యక్తి జగదేవ్కు తీవ్ర గాయాలు కాగా, ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
