30 మందితో వెళ్తున్న ట్రాక్టర్‌ నదిలో పడిపోయింది

30 మందితో వెళ్తున్న ట్రాక్టర్‌ నదిలో పడిపోయింది

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది.  నీళ్లు తీసుకురావడానికి 30 మందితో వెళ్తున్న ట్రాక్టర్‌ బ్రిడ్జిపై అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో  మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు అజ్మత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేట్టారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని  షాజహాన్‌పూర్‌ ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు.. గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.