సెప్టెంబర్ 1న హైటెక్ సిటీ.. మాదాపూర్ ఏరియాల్లో ట్రాఫిక్ మళ్లింపు

సెప్టెంబర్ 1న హైటెక్ సిటీ..  మాదాపూర్ ఏరియాల్లో ట్రాఫిక్ మళ్లింపు

సెప్టెంబర్ 1 శుక్రవారం హైటెక్ సిటీ,  మాదాపూర్‌లో  ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు  విధించారు. హెచ్‌ఐసీసీలో  జరగనున్న   భారత స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ ఆదేశాలు జారీ చేశారు. 

సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మేయర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఏయే మార్గాల్లో అంటే?

  • నీరుస్ - టోడీ కాంపౌండ్  - పర్వత్‌నగర్ 100 ఫీట్ రోడ్
  • నీరూస్  - సైబర్ టవర్స్ - మెటల్ చార్మినార్  - గూగుల్ (సిఐఐ)  - కొత్తగూడ జంక్షన్ రోడ్
  •  మెటల్ చార్మినార్  - ఖానామెట్ - హైటెక్స్/ HICC/ NAC రోడ్  
  • JNTU - సైబర్ టవర్ - బయో డైవర్సిటీ జంక్షన్.
  • గచ్చిబౌలి  - బొటానికల్ గార్డెన్  - కొత్తగూడ జంక్షన్ - కొండాపూర్ జంక్షన్. 
  • మియాపూర్  - హఫీజ్ పేట్  - హఫీజ్ పేట్ ఫ్లైఓవర్ - RTO ఆఫీస్ ప్రాంతాల్లో వచ్చే వాహనదారులు  ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు  ప్రత్యామ్నాయ రూట్లను  చూసుకోవాలని సూచించారు.

జేఎన్‌టీయూ సమీపంలోని సైబర్ టవర్స్, మియాపూర్ వైపు కొత్తగూడ, కావూరి హిల్స్ కొత్తగూడ వైపు, బయోడైవర్సిటీ సైబర్ టవర్స్ వైపు, నారాయణమ్మ కాలేజీ వైపు గచ్చిబౌలి వైపు వెళ్లే మార్గాల్లో భారీ వాహనాలను అనుమతించరు.