ఐటీ కారిడార్ ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్స్

ఐటీ కారిడార్ ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్స్

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా సైబరాబాద్ పోలీసులు 12 రోజులుగా ట్రాఫిక్ డైవర్షన్లను అమలు చేస్తున్నారు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ రూట్​లో ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీ వరకు ఆ రోడ్డును క్లోజ్ చేసి ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. దీని కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతుంటంతో సోమవారం సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ పోలీసు అధికారులతో కలిసి ఐటీ కారిడార్ ఏరియాను ఫీల్డ్ విజిట్ చేశారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యూటర్న్​లు, డైవర్షన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాహనదారులు ఏ రూట్ లో వెళ్లాలి.. ఎక్కడ యూటర్న్ తీసుకోవాలనే వివరాలను వెల్లడించారు. ట్రాఫిక్ డైవర్షన్లకు వాహనదారులు సహకరించాలని కోరారు.