
ఓటు వేసేందుకు జనం సొంతూళ్లకు తరలడంతో శుక్రవారం రాత్రి ఎల్బీనగర్ లోని విజయవాడ బస్ స్టాప్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కేందుకు జనం బారులు తీరారు.
ట్రాఫిక్‌ను కంట్రోల్చేసేందుకు పోలీసులు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుకు అడ్డంగా వెహికల్స్ నిలపడంతో ట్రాఫిక్‌జామ్ అయింది.