హైదరాబాద్ లో రేపు ( ఆగస్టు 24 ) మారథాన్..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో రేపు ( ఆగస్టు 24 ) మారథాన్..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సిటీలో ఆదివారం జరగనున్న హైదరాబాద్ రన్నర్స్ మారథాన్​ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్​ పోలీసులు ఆంక్షలు విధించారు.  ఉదయం 4:30 గంటల నుంచి 9:00 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమయ్యే మారథాన్.. ఎన్టీఆర్​ మార్గ్, చిల్ట్రన్​ పార్క్, సెయిలింగ్​ క్లబ్, సంజీవయ్య పార్క్,  ఖైరతాబాద్, రాజ్ భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, ఎంజే కాలేజీ, ఎస్ఎన్టీ జంక్షన్, సాగర్​ సొసైటీ,  కేబీఆర్​పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌‌‌‌పోస్ట్, రోడ్డు నం. 45 మీదుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని దాటి గచ్చిబౌలిలోని జీ.ఎం.సీ. బాలయోగి స్టేడియం వద్ద ముగుస్తుందని తెలిపారు. మారథాన్ జరిగే మార్గాల్లో వాహనదారులు ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపులిలా.. 

ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వి.వి. స్టాచ్యూ వద్ద షాదాన్, నీరంకారి భవన్ వైపు మళ్లిస్తారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు.. కె.సి.పి. జంక్షన్ వద్ద తాజ్ కృష్ణ, రోడ్డు నం. 10, 12, ఒరిస్సా ఐలాండ్ మీదుగా వెళ్లాలి.  ఇక్బాల్ మీనార్, లిబర్టీ, కర్బలా, ముషీరాబాద్, జబ్బార్ కాంప్లెక్స్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌‌‌‌ను లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. 

మినిస్టర్స్​ రోడ్, రాణిగంజ్ నుంచి వచ్చే ట్రాఫిక్​ను నల్లగుట్ట జంక్షన్ వద్ద దారి మళ్లిస్తారు. బేగంపేట నుంచి రాజ్ భవన్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ వైపు వచ్చే వాహనాలు గ్రీన్‌‌‌‌ల్యాండ్స్ జంక్షన్ వద్ద డి.కె. రోడ్, అమీర్​పేట మీదుగా వెళ్లాలి. మారథాన్ పంజాగుట్ట ఫ్లైఓవర్‌‌‌‌లోకి ప్రవేశించినప్పుడు, పంజాగుట్ట నుంచి రోడ్డు నం. 2 వైపు వెళ్లే ట్రాఫిక్​ను ఎన్.ఎఫ్.సి.ఎల్. జంక్షన్ వద్ద రోడ్డు నం.1 వైపు మళ్లిస్తారు. 

శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ నుంచి రోడ్డు నం. 2, బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు ఎస్.ఎన్.టి., సాగర్ సొసైటీ జంక్షన్ల వద్ద దారి మళ్లింపులను గమనించి, కమలాపురి కాలనీ, గ్రీన్ బావర్చి, వెంకటగిరి మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలి.

ఎన్.టి.ఆర్. భవన్ వైపు వచ్చే ట్రాఫిక్‌‌‌‌ను ఆయా జంక్షన్ల వద్ద దారి మళ్లిస్తారు.  బి.వి.బి. జంక్షన్, ఫిల్మ్ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్‌‌‌‌పోస్ట్ వైపు వచ్చే వాహనాలను జర్నలిస్ట్ కాలనీ వద్ద రోడ్డు నెం. 70, హాట్ కప్ మీదుగా మాదాపూర్ వైపు మళ్లిస్తారు .  మారథాన్ రోడ్డు నెం. 45 వైపు వెళ్లినప్పుడు,  అక్కడి మార్గాల్లోని ట్రాఫిక్‌‌‌‌ను రోడ్డు నెం. 36, రోడ్డు నెం. 2 వైపు మళ్లిస్తారు.అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌‌‌‌లైన్ నెం. 9010203626కు సంప్రదించాలని కోరారు. మారథాన్ సురక్షితంగా, విజయవంతంగా ముగిసేందుకు సహకరించాలని పోలీసులు  కోరారు. 

సైబరాబాద్​లో ఇలా..

నెక్లెస్ రోడ్డు నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఖానామెట్ మీదుగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వరకు మారథాన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు వివిధ మార్గాల్లో సైబరాబాద్​ట్రాఫిక్​ పోలీసులు ఆంక్షలు విధించారు. లింగంపల్లి  నుంచి ఐఐఐటీ జంక్షన్ ద్వారా వచ్చే ట్రాఫిక్​ను  షేక్​పేట ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ లెవల్-2 ఫ్లైఓవర్​కు మళ్లిస్తారు. 

జూబ్లీ హిల్స్ రోడ్ నం. 45 నుంచి వచ్చే వాహనాలు.. కేబుల్ బ్రిడ్జి, రోలింగ్ హిల్స్ రోడ్డు మీదుగా వెళ్లాలి. కొత్తగూడ నుంచి  సైబర్ టవర్స్ వైపు ఉదయం 7:15 గంటల వరకు ట్రాఫిక్‌‌‌‌ను అనుమతించరు. ఖాజాగూడ జంక్షన్ వద్ద కుడి వైపు రోడ్డు తీసుకొని బయోడైవర్సిటీ లెవల్-1 ఫ్లైఓవర్ మీదుగా గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఐఐఐటీ జంక్షన్, మస్జిద్ బండ జంక్షన్ చేరుకుని, అక్కడి నుండి లింగంపల్లికి వెళ్లాలి.

ఓఆర్‌‌‌‌ఆర్  వైపు వెళ్లే వాహనాలు ఖాజాగూడ జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి నానక్​రాంగూడ నుంచి ఓఆర్‌‌‌‌ఆర్​లోకి వెళ్లవచ్చు. ఇందిరానగర్ నుంచి హెచ్​సీయూ గేట్ నం.2 వరకు ఐఐఐటీ జంక్షన్ ద్వారా మధ్యాహ్నం 11.30 గంటల వరకు ట్రాఫిక్‌‌‌‌కు అనుమతి లేదు. కొత్తగూడ/కొండాపూర్ వైపు వెళ్లే వాహనాలు బయోడైవర్సిటీ లెవల్-1 ఫ్లైఓవర్, ఐకియా  అండర్​పాస్, లెమన్ ట్రీ, టెక్ మహీంద్రా, సీఐఐ మీదుగా వెళ్లాలి.

జూబ్లీ హిల్స్ రోడ్ నం.45 ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్డి ఉదయం 8:30 గంటల వరకు మూసివేస్తారు.కేపీహెచ్‌‌‌‌బి /కొత్తగూడ/కొండాపూర్ వైపు వెళ్లే వాహనాలు మాదాపూర్ మెయిన్ రోడ్డు, సైబర్ టవర్స్, యశోద హాస్పిటల్ మీదుగా  వెళ్లాలి.ఏఐజీ  హాస్పిటల్ వైపు వెళ్లే వాహనాలు సైబర్ టవర్స్ నుంచి ఎడమవైపు తిరిగి, సీఓడీ, వెస్టిన్, మైండ్‌‌‌‌స్పేస్ రోటరీ, ఐకియా  రోటరీ మీదుగా వెళ్లాలి. కొత్తగూడ/కొండాపూర్ వైపు వెళ్లే వాహనాలు సైబర్ టవర్స్ నుంచి సీఓడీ, మైండ్​స్పేస్ రోటరీ, ఐకియా  రోటరీ, ఏఐజీ  మీదుగా బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లాలి.సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ వరకు ఉదయం 7:30 గంటల వరకు, ఐకియా వరకు ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్‌‌‌‌కు అనుమతి లేదు.