- ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపులు
- పార్కింగ్ ఏరియాల ప్రకటన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి శనివారం నుంచి అనుమతించనున్న నేపథ్యంలో సెప్టెంబర్12 నుంచి 24వ తేదీ వరకు సిటీ పోలీసులు ట్రాఫిక్ఆంక్షలు పెట్టారు. రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేయనున్నారు.
వీవీ విగ్రహం వైపు నుంచి..రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వాహనాలను అనుమతించరు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుంచి..రాజ్ దూత్ లేన్ మీదుగా బడా గణేశ్ వైపు వాహనాలకు పర్మిషన్లేదు. వీటిని రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ వైపు నుంచి..మింట్ కాంపౌండ్ మీదుగా ఐమాక్స్వైపు వాహనాలను రానివ్వరు. మింట్ కాంపౌండ్ లైన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డు వైపు పంపిస్తారు.
- నెక్లెస్ రోటరీ వైపు నుంచి..మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వెహికల్స్‌ను నెక్లెస్ రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
- నిరంకారి వైపు నుంచి..ఖైరతాబాద్ పోస్టాఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వాహనాలు వెళ్లడానికి లేదు. ఈ వాహనాలను పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్
- భక్తుల రాకతో ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, అయోధ్య, నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ జంక్షన్, నెక్లెస్ రోటరీ, కేసీపీ జంక్షన్, మాసాబ్ ట్యాంక్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంటుంది.
- పార్కింగ్ స్థలాలు
- నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తులు తమ వెహికల్స్ ను రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐ మాక్స్థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలం, ఐమాక్స్థియేటర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్చేసుకోవాలి. ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే భక్తుల కోసం విశ్వేశ్వరయ్య భవన్‌లో పార్కింగ్ సదుపాయంకల్పించారు.
