ట్రాఫిక్ మళ్ళింపుకు సహకరించాలి: ట్రాఫిక్ జాయింట్ కమిషనర్

ట్రాఫిక్ మళ్ళింపుకు సహకరించాలి: ట్రాఫిక్ జాయింట్ కమిషనర్

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45, జర్నలిస్ట్ కాలనీ మార్గంలో ట్రాఫిక్ తగ్గించడానికి.. కోన్ని ట్రాఫిక్ మళ్ళింపులు చేశామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాధ్ తెలిపారు. రేపటి నుంచి వారం రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో వాహనదారులందరూ తమకు సహకరించాలని కోరారు. ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు తమ దృష్టికి వస్తే మార్పులు చేస్తామన్నారు.

8 ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను గుర్తించి వాహనాల మళ్ళింపు చేశామని కమిషనర్ రంగనాధ్ వెల్లడించారు. ఎక్కువగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని గమనించామని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను రోడ్డు నెంబర్ 45 వైపు సులభంగా చేరుకునే విధంగా నూతన ఫ్లైఓవర్లను ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు.