హైదరాబాద్ లో సెప్టెంబర్ 6 సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వనస్థలిపురం దగ్గర విజయవాడ హైవేపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మోకాల్లోతు నీళ్లల్లో కార్లు మొరాయించాయి. డ్రైనేజీలు సైతం ఉప్పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ALSO READ | ఏపీ వరదలు: బుడమేరులో చిక్కుకున్న బోటు.. తప్పిన ప్రమాదం
సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. బంజారాహిల్స్, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, బషీర్ బాగ్ సహా పలు ఏరియాల్లో వర్షం దంచికొట్టింది. మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో వర్షానికి రోడ్లపై వరదనీరు చేరింది. ఆసిఫ్ నగర్ లో భారీవర్షానికి రోడ్లు జలమయ్యాయి. వరద నీటితో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. అబిడ్స్ లో కాలనీలు జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.