మైలార్ దేవ్ పల్లిలో ట్రాఫిక్ నరకం

మైలార్ దేవ్ పల్లిలో ట్రాఫిక్ నరకం

రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ మండలంలోని మైలార్ దేవ్ పల్లి చౌరస్తా దగ్గర రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సేవరేజీ బోర్డు సిబ్బంది.. మంచి నీటి కొరకు దుర్గా నగర్ నుంచి మైలార్ దేవ్ పల్లి వరకు ప్రత్యేక లైన్ వేస్తున్నారు. తమకు ఎటువంటి సూచనలు చేయకుండానే.. పైప్ లైన్ కోసం రోడ్డు తవ్వేశారని అంటున్నారు స్థానికులు. ప్రతిరోజు రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోందనీ… అంటున్నారు.

ట్రాఫిక్ పోలీసులు ఉన్నా కూడా.. ఏమీ చేయలేకపోతున్నారనీ.. ఉద్యోగులు చెబుతున్నారు. ఎల్ బీ నగర్ నుండి గచ్చిబౌలి వెళ్లే ప్రధాన మార్గం కావడంతో…. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇతర కంపెనీల ఉద్యోగులతో ఈ రోడ్డు ఉదయం, సాయంత్రం బిజీగా ఉంటుంది. ఇటీవలి రోజుల్లో ఈ ప్రయాణం అంటేనే నరకంగా మారిందంటున్నారు ఆ దారిగుండా వెళ్లేవాళ్లు.