సూరారం చౌరస్తాలో సీపీఆర్తో ప్రాణం నిలిపిన పోలీస్

సూరారం చౌరస్తాలో  సీపీఆర్తో ప్రాణం నిలిపిన పోలీస్

జీడిమెట్ల, వెలుగు: గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తికి ట్రాఫిక్​ మార్షల్​ సీపీఆర్​ చేసి రక్షించారు. సూరారం చౌరస్తాలో రహీం అనే వ్యక్తి శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్​ మార్షల్​ శివకుమార్​ స్పందించి అతడికి సీపీఆర్​ చేశాడు. 

కొద్దిసేపటికి అతడు సృహలోకి రావడంతో, శివకుమార్​ అతడిని పక్కనే ఉన్న దవాఖానకు తరలించాడు. డాక్టర్లు ట్రీట్​మెంట్​ ఇవ్వడంతో  కోలుకున్నాడు. శివకుమార్​ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.