బాదనకుర్తి చెక్ పోస్టు వద్ద రూ.1.75 లక్షలు పట్టివేత

బాదనకుర్తి చెక్ పోస్టు వద్ద రూ.1.75 లక్షలు పట్టివేత

ఖానాపూర్, వెలుగు: బాదనకుర్తి చెక్ పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.1.75 లక్షలను పట్టుకున్నట్లు తహసీల్దార్ సుజాత రెడ్డి, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. 

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు డబ్బులు తరలిస్తూ పట్టుబడ్డారని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు, మద్యం తరలిస్తే సీజ్ చేసి, కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.