ఖానాపూర్, వెలుగు : న్యాయవాదులకు బీమా సదుపాయంతోపాటు రక్షణ చట్టం అమలుకు తన వంతు కృషి చేస్తానని పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలో ఆయన తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
స్థానిక బా ర్ అసోసియేషన్ సభ్యులతోపాటు న్యాయవాదులను కలిసి త్వరలో జరగనున్న తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం న్యాయవాదులు ఆయనను సన్మానించారు. ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మంత్రరాజం సురేశ్, ఏజీపీ ఆసిఫ్ అలీ, న్యాయవాదులు సత్యనారాయణ, రాజశేఖర్, వెంకట్ మహేంద్ర, శివ, షబ్బీర్ పాషా, సలీం, ఖదీర్ తదితరులున్నారు.
