ఆసిఫాబాద్, వెలుగు: ఈవీఎంల గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గోదాంను అడిషనల్ కలెక్టర్డేవిడ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, సీల్వేసిన తాళాలను చూశారు. సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
