కోల్బెల్ట్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లపై పోలీస్ నిఘా ఉంటుందని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా ఉపేక్షించబోమని మందమర్రి సీఐ శశీధర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మందమర్రి పోలీస్స్టేషన్లో సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు. రౌడీషీటర్లు ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రామకృష్ణాపూర్, కాసీపేట, మందమర్రి ఎస్సైలు రాజశేఖర్, ఆంజనేయులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
