ప్రజలు నిర్భయంగా ఓటు వేయాల : సీఐ సంతోష్కుమార్

ప్రజలు నిర్భయంగా ఓటు వేయాల : సీఐ సంతోష్కుమార్

కాగజ్ నగర్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని కౌటాల సీఐ సంతోష్​కుమార్ అన్నారు. శుక్రవారం చింతలమానేపల్లి మండలం రవీంద్ర నగర్ మార్కెట్ లో పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించారు.

 ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సైలు నరేశ్, చంద్రశేఖర్, సురేశ్, సర్తాజ్ పాషా, పోలీస్​సిబ్బంది పాల్గొన్నారు.