ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన : 3892 ఆర్టీసీ బస్సులపై కేసులు

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన : 3892 ఆర్టీసీ బస్సులపై కేసులు

హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలపై కేసులు నమోదు చేయడంతోపాటు చలాన్లు విధించారు. 24,658 ట్రిపుల్ రైడింగ్ కేసులతో పాటు లక్షా 30వేల 311 రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 3,892 ఆర్టీసీ బస్సులతో పాటు 5,806 హెవీ వెహికిల్స్ పై కేసులు కేసుల నమోదు చేశామన్నారు. గతేడాది సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఆపరేషన్ రోప్లో భాగంగా 32,064 ఫ్రీ లెఫ్ట్ బ్లాకింగ్ కేసులు.. 2,01,377 స్టాప్ లైన్ వయోలేషన్ కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 200 షాప్స్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు చెప్పారు.  ఫుట్‌పాత్ ఎన్క్రోచ్ చేసిన వివిధ సంస్థలపై 12,946 కేసులు నమోదు చేశామన్నారు. అదేవిధంగా రాంగ్ పార్కింగ్ చేసిన 53వేల 424 వెహికిల్స్పై టోయింగ్ కేసులు బుక్ చేసినట్లు వెల్లడించారు.