మెట్రో నిర్మాణంతో మరిన్ని ట్రాఫిక్ కష్టాలు

మెట్రో నిర్మాణంతో మరిన్ని ట్రాఫిక్ కష్టాలు

కొండాపూర్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందేనేమో.  ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్‍ కష్టా లు తీరుతాయనుకుంటే.. ఈ పనుల జాప్యంతో యాతన పెరిగింది. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం ఇబ్బందిగా మారుతోంది. నిర్మాణ పనులకు సంబంధించి ఆస్తుల సేకరణ పూర్తి కాలేదు. కొన్ని కోర్టు కేసులో కూడా ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం అధికారులు మార్గా లు అన్వేషిస్తున్నారు.

ఐటీ కారిడార్ లో అధిక రద్దీ

ఐటీ కారిడార్ లో పెరుగుతున్న ట్రాఫిక్ కు అను-గుణంగా అవసరమైన ప్రాంతాల్లో ఫ్లైఓవర్ ని-ర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టా రు.ముఖ్యంగా మియాపూర్, చందానగర్, లింగం-పల్లి, బాచుపల్లి ప్రాంతాల నుండి కొండాపూర్మీదుగా గచ్చిబౌలికి ట్రాఫిక్‍ సమస్య రోజురో-జుకూ తీవ్రరూపం దాల్చుతోం ది. దీన్ని పరిష్క-రించేం దుకు రాష్ర్ట ప్రభుత్వం రూ. 199 కోట్లవ్యయంతో కొండాపూర్, బొటానికల్ గార్డెన్ల మధ్య 2.2 కిలోమీటర్ల దూరం ఫ్లైఓవర్ నిర్మాణపనులు మొదలయ్యా యి. ఈ ఫ్లైఓ వర్ నిర్మాణపనులను 2018 అక్టోబర్ నెలలో ప్రారంభించా-రు. దీనిలో భాగంగా కొండాపూర్ లో ని కొత్తగూడజంక్షన్ వద్ద అండర్ పాస్ ను కూడా నిర్మించేం దుకు నిధులు కేటాయించారు. మొత్తం నిర్మాణపనులను ఏప్రిల్ 2020 వరకు గడువు తేది లోపుపూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఐదు నెలలైనా.. ఊపందుకోలే..

లింగంపల్లి, మియాపూర్ , అల్వి న్ క్రాస్ రోడ్డునుండి గచ్చిబౌలి వెళ్లేం దుకు కొండాపూర్, బొటా-నికల్ గార్డెన్ మధ్య నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణపనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణపనులు చేపట్టేం దుకు రోడ్డుపై ఏర్పాటు చేసినబారికేడ్ల వల్ల ఉదయం, సాయంత్ర వేళ్లలో కిలోమీటర్ మేర తీవ్ర ట్రాఫిక్ జాం అవుతోంది.వేలాది వాహనాలు ట్రాఫిక్ లో గంటల తరబడివేచిఉంటున్నారు. పనులు ప్రారంభమై ఐదునెలలు గడుస్తున్నా.. ఇంకా కొన్ ని చోట్ల పిల్లర్ లుకూడా నిర్మిం చలేదు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లోభాగంగా రోడ్డుకు ఇరువైపులా చేపడుతున్న రోడ్డువెండిం గ్ పనులను అధికారులు ఆలస్యంగా చే-పడుతున్నారు. కొత్తగూడ జంక్షన్, బొటానికల్గార్డెన్ ముందు మాత్రమే ప్రస్తుతం పిల్లర్ లు నిర్మాణదశలో ఉన్నాయి.

ఆస్తుల సేకరణలో జాప్యం

ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా అధికా-రులు రోడ్డు విస్తరణను చేపట్టాలి. దీనిలోభాగంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న భూ సేకరణచేయాల్సి ఉంది. కానీ ఇది ఆలస్యమవుతోంది.కొన్ ని చోట్ల ఆస్తులను ఇచ్చేం దుకు యజమాను-లు సహకరించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. బొటానికల్ గార్డెన్ వద్ద ఉన్న స్థలంకోర్టు కేసులో ఉన్నం దన ఇక్కడ నిర్మాణ పనులుఆలస్యయ్యేలా ఉన్నాయి.

వేగంగా పనులు చేయిస్తున్నం

కొండాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నాం. ప్రస్తుతం రోడ్డు వెడల్పు పనులు సాగుతున్నా యి. రోడ్డు కుఇరువైపులా ఉన్న ఆస్తు ల సేకరణలో కొంతజాప్యం ఏర్పడుతోంది. కొన్ని స్థలాలు కోర్టువివాదంలో ఉన్నా యి. అవి పరిష్కారంఅయిన వెంటనే పనులను మరింతవేగవంతం చేస్తాం . గడువు లోపు నిర్మాణపనులు పూర్తి చేసేలా కృషి చేస్తు న్నాం.వాహనదారులు, ప్రజలు సహకరించాలి. -పరమేశ్వర్, ప్రాజెక్టు అసిస్టెం ట్ ఇంజినీర్‍