నెక్లెస్​ రోడ్ టు హైటెక్​ సిటీ 10 కే రన్​... ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

నెక్లెస్​ రోడ్ టు హైటెక్​ సిటీ 10 కే  రన్​... ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్​ మారథాన్ – 2023 ఆగస్టు 27 ఉదయం 4.30 కి ప్రారంభమయింది. ఉదయం 10 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్​ రన్నర్​ సొసైటీ రన్​లో దాదాపు 21వేల మంది యూత్​ రన్నింగ్​లో పాల్గొన్నారు. నెక్లెస్​రోడ్​లో ప్రారంభమైన మారథాన్​గచ్చిబౌలి స్టేడియంలో ముగియనుంది. హైటెక్ సిటీలో సైతం 10కే రన్​ ప్రారంభమైంది. విన్నర్స్​కి మెడల్స్ తో పాటు ప్రైజ్​ మనీ ఇవ్వనున్నారు. 

రోడ్లు మూసి ఉండే ప్రాంతాలివే...

  • మారథాన్ సాగే దారుల్లో వాహనదారులకు అనుమతి ఉండదని సైబరాబాద్​జాయింట్​సీపీ నారాయణ నాయక్​ తెలిపారు. ఆ మార్గాలేంటంటే.. మై హోం అభ్రా, సీ గేటు రెండు యూటర్న్, ఐఓసీఎల్​లేన్, స్కైవ్యూ మార్గం, మై హోం భూజా దారిలో అనుమతించకుండా నాలెడ్జ్ సిటీ రోడ్డు, డల్లాస్​ సెంటర్​రోడ్డు, స్కైవ్యూ లేన్, బయోడైవర్సిటీ సర్కిల్​మీదుగా మళ్లిస్తారు.
  • ట్రాన్స్ కో యూటర్న్, స్కైవ్యూ యూటర్న్​, బయోడైవర్సిటీ వద్ద గచ్చిబౌలి వైపు యూటర్న్ మూసి ఉంచి ఐకియా రోటరీ మీదుగా అనుమతిస్తారు.
  • గచ్చిబౌలి స్టేడియం నుంచి బయౌడైవర్సిటీ కూడలి వరకు ఉదయం 4 నుంచి 11 వరకు అన్ని యూటర్నులు మూసేస్తారు.