
- బొల్లారం నుంచి బేగంపేట్ వరకు అమలు
- ఉదయం11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధింపు
- నోటిఫికేషన్ విడుదల చేసిన సిటీ ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్,వెలుగు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ నిలిపివేత లేదంటే డైవర్షన్ చేస్తారు. సోమవారం సిటీ ట్రాఫిక్ పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి కాన్వాయ్ వచ్చే లోతుకుంట టి జంక్షన్,ఎంసీఈఎంఈ సిగ్నల్
లాల్ బజార్ టి జంక్షన్, తిరుమలగిరి క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్ ఇన్ గేట్, టివోలి క్రాస్ రోడ్స్, ఎస్‌బీఐ క్రాస్ రోడ్స్, సిటీఓ, ప్లాజా క్రాస్ రోడ్స్, రసూల్‌పురా జంక్షన్, పీఎన్‌టీ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, మొనప్ప రాజీవ్ గాంధీ విగ్రహం మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.