హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

దేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ లో ఏప్రిల్ 14న ఆవిష్కృతం కానుంది.  ట్యాంక్ బండ్ పరిధిలో 125 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు..  విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఏప్రిల్ 14 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ మార్గాల్లో  ఈ ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉండనున్నాయి.  వాహనాలను దారి మళ్లించనున్నారు పోలీసులు. అయితే ఈ ఏరియాలకు వచ్చే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.  ఏదైనా అత్యవసరం అయితే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626 కి ఫోన్ చేయాలని కోరారు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా

  • ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్ , లుంబీనీ పార్కులు మూసివేత
  • నెక్లె్స్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ , తెలుగు తల్లి జంక్షన్ వైపు వాహనాలకు అనుమతి లేదు
  • ట్యాంక్ బండ్ ,బీఆర్కే భవన్ ,తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ వైపు వెళ్లే వాహనాలు లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.
  • లక్డీకపూల్ నుంచి ట్యాంక్ బండ్ ,లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లిస్తారు.
  •  పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను షాదన్ కాలేజ్ మీదుగా దారి మళ్లిస్తారు.
  • సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్కగ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు  రాణిగంజ్ వైపు మళ్లింపు