సికింద్రాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు.. మూసి ఉండే రోడ్లివే..

 సికింద్రాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు.. మూసి ఉండే రోడ్లివే..

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు సంబంధించి జులై 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి జూలై 10న జాతర ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లను నగర పోలీసులు ప్రకటించారు.  కర్బలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ పిఎస్ రాంగోపాల్‌పేట్, ప్యారడైజ్, సిటిఓ, ప్లాజా, ఎస్‌బిఐ ఎక్స్ రోడ్, వైఎమ్‌సిఎ, ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, రోడ్లు, జంక్షన్‌లలో రాకపోకలు నిషేధం అని తెలిపారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు.  సికింద్రాబాద్​వచ్చే మార్గంలో సైతం ట్రాఫిక్ ఉంటుందని తెలిపారు. 

మూసేసే రోడ్లు.. 

పొగాకు బజార్, హిల్ స్ట్రీట్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి 
బాటా క్రాస్​ రోడ్ల నుండి పాత రాంగోపాల్‌పేట పీఎస్​, సికింద్రాబాద్ వరకు  
సికింద్రాబాద్ ఔడయ్య ఎక్స్ రోడ్స్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి 
జనరల్ బజార్ సికింద్రాబాద్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారి 

మళ్లింపు పాయింట్లు...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు రాణిగంజ్ క్రాస్​ రోడ్లు 
ఘస్మండి క్రాస్​  రోడ్లు
పాట్నీ క్రాస్ రోడ్లు
పారడైజ్ క్రాస్ రోడ్లు 
 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అటు ఇటు...
ఉప్పల్ నుండి పంజాగుట్ట వైపు
ఇవే కాక బోనాలు జరిగే మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వివరించారు.