కామారెడ్డిటౌన్, వెలుగు : ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతి ఒకరూ అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి టి.నాగరాణి పేర్కొన్నారు. సోమవారం లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని విద్యానికేతన్ స్కూల్లో ట్రాఫిక్రూల్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం ట్రాఫిక్ రూల్స్ పోస్టర్లను ఆవిష్కరించి జడ్జి మాట్లాడారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయన్నారు. జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్‌ను వివరించారు. పిల్లలు తల్లిదండ్రులకు సూచించాలన్నారు. అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
