వాహనదారులు జాగ్రత్త..28 నుంచి స్పెషల్ డ్రైవ్

వాహనదారులు జాగ్రత్త..28 నుంచి స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ ను కఠినతరం చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ పై ఈ నెల 28 నుంచిస్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న తీరును ఆయన ఖండించారు. చలాన్లతో ప్రభుత్వానికి బడ్జెట్ వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ గురించి ఆయన వివరించారు. గతంలో చలాన్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గమనించి డిస్కౌంట్లు ఇచ్చామని గుర్తు చేశారు. టూ వీలర్ వాహనదారులకు గతంలో కంటే ఇప్పుడు చలాన్లను తగ్గించామన్నారు.  కార్లు, హెవీ వెహికిల్స్‭తో ప్రమాదం జరిగితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న.. ఆయన వాటికి మాత్రం చలానా ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

ప్రమాదాలను తగ్గించేందుకే ట్రాఫిక్ రూల్స్‭లో మార్పులు చేశామని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ చెప్పారు. వాహనదారుల్లో డిసిప్లెయిన్ రావడానికి మాత్రమే ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వారి పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెంపర్వరీ నెంబర్ కేవలం నెలరోజుల వరకే ఉంటుందని..  ఆ తరువాత ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని చెప్పారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలు నేరాలకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నగరంలో 2014లో 41 లక్షల వాహనాలు ఇప్పుడు ఇప్పుడు 81 లక్షల వరకు పెరిగాయని సీపీ రంగనాథ్ వివరించారు.